HomeTelugu Big Stories'ఆదిపురుష్‌' కొత్త పోస్టర్‌పై కేసు నమోదు

‘ఆదిపురుష్‌’ కొత్త పోస్టర్‌పై కేసు నమోదు

complaint filed on adipurus

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న’ఆదిపురుష్’ సినిమాకి తొలి నుండి కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఈ సినిమాను గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల వాయిదా వేశారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా నుండి శ్రీరామ నవమి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ పోస్టర్‌ విడుదల చేసినప్పటి నుండి దీనిపై పలు రకాల కామెంట్స్‌ వస్తున్నాయి. ఆదిపురుష్ శ్రీరామ నవమి పోస్టర్ లో సీత దేవి మరియు రాముడి వేషధారణ ఇంకా వారి యొక్క బాడీ లాంగ్వేజ్ హిందువుల మనోభావాలను కించ పరిచే విధంగా ఉన్నాయంటూ కొందరు ఆరోపిస్తున్నారు.

రాముడిని ఇప్పటివరకు చూసిన విధంగా కాకుండా విభిన్నంగా చూపించడం. జంజం తాడు లేదని.. ఇలాంటి దుస్తులు వేసుకున్నట్లుగా చూపించడం వల్ల రాముడిని అవమానించినట్లే అంటూ ముంబయికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించింది. ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీ సింగ్‌, హ‌నుమంతుడిగా దేవ‌ద‌త్త న‌గే క‌నిపిస్తున్నారు. ఇక సైఫ్ ఆలీఖాన్ లంకాధిప‌తిగా న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో టి సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu