వెంకీతో నిత్య రొమాన్స్!

వెంకటేష్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో
హీరోయిన్ గా నిత్యమీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె
స్వయంగా వెల్లడించారు. ఒక మధ్యతరగతి వ్యక్తికి, ఓ యువతికి మధ్య చోటు చేసుకునే ప్రేమ కథాంశంతో
సినిమా రూపొందనుంది. నిత్య ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని పాత్ర కావడంతో
వెంటనే ఓకే చెప్పేసిందట. వెంకటేష్ కూడా కథ విన్న వెంటనే ఓకే చెప్పడం, ఇప్పుడు
నిత్యకు కూడా కథ నచ్చి ఒప్పుకోవడంతో ఈ సినిమా మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
వెంకటేష్ ప్రస్తుతం ‘సాలా ఖడూస్’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ
సినిమా పూర్తయిన వెంటనే కిషోర్ తిరుమల సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో
ఉన్నారు!

CLICK HERE!! For the aha Latest Updates