Homeతెలుగు Newsవెనుకంజలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు

వెనుకంజలో కాంగ్రెస్‌ ముఖ్యనేతలు

5 10తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ దూసుకుపోతుంది. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనరసింహా వెనుకంజలో ఉన్నారు. కొడంగల్‌లో రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, నాగార్జునసాగర్‌లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య ఆధిక్యంలో ఉన్నారు. నరేందర్‌రెడ్డిపై రేవంత్‌ 651 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. మరోవైపు గజ్వేల్‌ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సిద్ధిపేటలో హరీశ్‌రావు, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, తుంగతుర్తిలో గాదరి కిషోర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!