HomeTelugu Big Storiesఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం స్టేటస్ సింబల్: నటి

ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం స్టేటస్ సింబల్: నటి

Consuming drug is status sy

డ్రగ్స్‌ భూతం సినీ ఇండస్ట్రీలో మరోసారి ప్రకంపనలు రేపింది. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ మృతి కేసు విచారణలో భాగంగా డ్రగ్స్‌ కేసు మరోసారి వెలుగుచూసింది. ఈ డ్రగ్స్‌ వివాదంలో రోజుకో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు మరో నలుగురిని ఎన్‌సీబీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక సమాచారం బయటపడింది. డ్రగ్స్‌ కేసులో రియాను హనీ ట్రాప్‌గా ఉపయోగించారని దీని వెనుక పెద్ద కుట్ర ఉందని సుశాంత్, అంకిత లోఖండేల సన్నిహితురాలైన బాలీవుడ్‌ నటి వెల్లడించింది. డ్రగ్స్ ముఠా గేమ్‌లో సుశాంత్, రియాను పావుల్లా వాడుకున్నారని. దీనికి సుశాంత్ బలైపోయారని సదరు నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాలను వెల్లడించారు.

డ్రగ్స్ తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో స్టేటస్ సింబల్‌గా భావిస్తారని తెలిపింది. ఆమె కూడా ఒకప్పుడు ఈ డ్రగ్స్‌ పెడ్లర్ల బాధితురాలినే అని చెప్పారు. అదృష్టవశాత్తు దానినుంచి బయట పడినట్లు తెలిపారు. తన జీవితంలో అది ఒక భయంకరమైన దశ అని తెలిపారు. సుశాంత్‌ మృతి కారణాలు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఇందంతా చూస్తుంటే తన జీవితాన్ని తెరపై చూస్తున్నట్టుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ మరో పేరు డ్రగ్స్‌గా ఆమె చెప్పింది. ఈ డ్రగ్స్‌ ముఠా చాలా పెద్దది. పరిశ్రమలో పెద్ద పెద్ద లింక్‌లు ఉన్నాయని సదరు నటి వెల్లడించింది. పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఈ సందర్భంగా నటి గుర్తు చేసుకున్నారు.

‘‘పరిశ్రమలో ఎవరికి తెలియని డ్రగ్స్‌ చీకటి కోణం ఉంది. నేను అలీబాగ్‌లోని ఓ గ్రామం నుంచి వచ్చాను. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఓ పార్టీకి వెళ్లాను. అక్కడ నా ఎదురుగా ఉన్న బల్లపై తెల్లటి పౌడర్‌ ఉంది. అది డ్రగ్‌ అని తెలిసి ఆశ్చర్యపోయాను. అయితే అక్కడి వారంతా నువ్వు ఈ డ్రగ్‌ తీసుకోకపోతే నిన్ను విలేజ్ నుంచి వచ్చిన వ్యక్తిగా చులకనగా చూస్తారు’’ అని తనతో చెప్పినట్లు ఆమె వెల్లడించింది. బాలీవుడ్‌లో డ్రగ్‌ తీసుకోవడం ట్రెండ్‌గా ఫాలో అవుతారని, ఇది తీసుకోకపోతే మిమ్మల్ని వింతగా చూస్తారని చెప్పింది. పెద్ద పెద్ద పార్టీల్లో మాదక ద్రవ్యాలను విచ్చల విడిగా వినియోగిస్తారని, పార్టీలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా డీలర్లు, పెడ్లర్‌లు ఉన్నట్లు ఆమె తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu