HomeTelugu Newsఏపీలో 2 లక్షలు దాటిన కరోనా బాధితులు

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా బాధితులు

Corona cases 2 lakhs mark c
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు ప్రకారం ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 2,06,960కి చేరింది. గ‌త 24 గంట‌ల్లో 62,938 క‌రోనా శాంపిల్స్ పరీక్షలు నిర్వహించగా 10,171 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఒకే రోజు 89 మంది మృతి చెంద‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. రాష్ట్రవ్యాప్తంగా 84,654 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అలాగే 1,20,464 మంది ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 1842 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా కరోనా బాధితుల సంఖ్య చూస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 28,850 మందికి కరోనా సోకింది. వీరిలో 15,968 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, 12,940 మంది చికిత్సపొందుతున్నారు. జిల్లాలో రోజుకు వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!