HomeTelugu Big Storiesభారత్‌లో కొనసాగుతున్న కరోనా మహమ్మారి విజృంభణ

భారత్‌లో కొనసాగుతున్న కరోనా మహమ్మారి విజృంభణ

5a 4

భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 33,610కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 1823 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 67 మంది మృతిచెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1075 మంది ప్రాణాలు కోల్పోగా 8,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 25 శాతానికి పైగా నమోదైంది.

14 రోజుల క్రితం ఈ రేటు 13.06 శాతంగా ఉండేదని కేంద్రం వెల్లడించింది. దేశంలో 11 రోజులకోసారి కరోనా కేసులు రెట్టింపు అవుతున్నట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 9,915 కేసులు నమోదు కాగా, గుజరాత్‌లో 4082, ఢిల్లీ 3439, మధ్యప్రదేశ్ 2660, రాజస్థాన్ 2438, ఉత్తర ప్రదేశ్ 2203, తమిళనాడు 2162 పాజిటివ్ కేసులు
నమోదు అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1403కి చేరింది. ఇవాళ ఒక్కరోజు కర్నూలులో 43 కొత్త పాజిటివ్ కేసులు నమోదైంది. జిల్లాల వారీగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 386 మంది కరోనా బాధితులుండగా, గుంటూరు 287, కృష్ణా 246, నెల్లూరు 84, చిత్తూరు 80, కడప 73, అనంతపురం 61, ప్రకాశం 60, ప.గో. 56, తూ.గో 42, విశాఖ 23, శ్రీకాకుళం 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 31 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 1051 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 321 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

తెలంగాణలో గత వారంరోజులుగా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా ఇవాళ మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. 4 రోజులుగా సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్న కరోనా కేసులు ఇవాళ 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 1,038కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 25 మంది కరోనాతో మృతిచెందారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu