మహేష్ తో పాటు ఆ ఇద్దరు కూడా..!

మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ నుండి మహేష్ కొంత గ్యాప్ తీసుకొని మలేషియాకు వెళ్ళాడు. అయితే ఇది ఫ్యామిలీ ట్రిప్ అనుకోకండీ.. ఎందుకంటే మహేష్ వెళ్ళేది తన హెల్త్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి.. అసలు విషయంలోకి వస్తే మహేష్ కు ప్రతి ఏడాది డీ టాక్సినేషన్ చేయించుకోవడం అలవాటు. గతేడాది డెహ్రాడూన్ లో ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఈ ఏడాదిలో మలేషియాలో చేయించుకోనున్నారు.

శరీరంలో ఉన్న మలినాలను కొన్ని వ్యాయామాలు, మెడిసిన్స్, మసాజ్ ల ద్వారా చెమట రూపంలో తొలగించడమే డీటాక్సినేషన్ ప్రాసెస్. అంతేకాదు దీంతో పాటు మహేష్ ఓ రెండు కేజీల బరువు తగ్గాలని నిర్ణయించుకున్నారట. అయితే మహేష్ తో పాటు కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్ లు కూడా మలేషియాకు వెళ్ళినట్లు తెలుస్తోంది.

మహేష్ తదుపరి చిత్రం కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవి మ్యూజిక్ అందివ్వనున్నాడు. కథ, కథనాలను వినిపించడం కోసం దేవి రెడీ చేసిన కొన్ని ట్యూన్స్ వినిపించడం కోసమే దేవి, కొరటాల మలేషియాకు వెళ్ళినట్లు తెలుస్తోంది. మహేష్ కు కూడా సమయం వృధా చేయడం ఇష్టం లేకనే ఇలా ప్లాన్ చేసుకున్నారని చెబుతున్నారు.