HomeTelugu Newsతెలంగాణలో 1061 కరోనా కేసులు

తెలంగాణలో 1061 కరోనా కేసులు

12 1

తెలంగాణలో శనివారం కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1061కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 15 కొత్త కేసులు బయటపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ కరోనా నుంచి కోలుకుని 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో 499 మంది కరోనా బారినుంచి బయటపడ్డారు.
మరో 533 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు యాదాద్రి-భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu