స్టైలిష్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న క్రికెటర్ శ్రీశాంత్ టీమ్ 5 చిత్రం

స్టైలిష్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న క్రికెటర్ శ్రీశాంత్ టీమ్ 5 చిత్రం
 
ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. గతంలో శ్రీశాంత్ ను హీరోగా పరిచయం చేయాలని చాలామంది ప్రయత్నించారు. కానీ రాజ్ జకారిస్ ప్రొడక్షన్ వాల్యూస్, సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం బాగా నచ్చడంతో హీరోగా నటించేందుకు ఒప్పుకున్నారు. పదునైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ ను హడలెత్తించిన శ్రీశాంత్… నటనలోనూ అంతే చలాకితనం, అంతే పట్టుదలను చూపిస్తున్నారు. ఇందులో శ్రీశాంత్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. తన క్యారెక్టర్ తో పాటు, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ పెయిర్ చూడముచ్చటగా ఉండనుంది. వీరితో పాటు పెర్ల్ మానే, మఖరంద్ దేశ్ పాండే ఇతర పాత్రలు పోషించారు. గోపి సుందర్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. అక్టోబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు.  
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ… ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. చాలా మంది దర్శక నిర్మాతలు శ్రీశాంత్ ని హీరోగా పరిచయం చేయాలని ట్రై చేశారు. కానీ మా కథ, కథనం మీద నమ్మకంతో… ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో ఒప్పుకున్నారు. కేవలం ఒప్పుకోవడమే కాకుండా క్యారెక్టర్ కు తగ్గట్టుగా తనను తాను మలచుకున్నారు. డైలాగ్స్, డ్యాన్సులు, ఫైట్స్ ఇరగదీస్తున్నారు. కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. టీమ్ 5 అనే టైటిల్ కు తగ్గట్టుగా మా దర్శకుడు సురేష్ గోవింద్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నాం. త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియజేస్తాం. అని అన్నారు.  
 
నటీనటులు, శ్రీశాంక్. నిక్కీ గర్లానీ, పార్లే మానే, మకరంద్ దేశ్ పాండే తదితరులు
 
సాంకేతిక నిపుణులు
 
బ్యానర్ – సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్
సంగీతం – గోపి సుందర్
ఎడిటర్ – దిలిప్ డెన్నిస్
ఆర్ట్ – సాహస్ బాల
డైరెక్టర్ – సురేష్ గోవింద్
ప్రొడ్యూసర్ – రాజ్ జకారియాస్
IMG-20160620-WA015
CLICK HERE!! For the aha Latest Updates