బన్నీ సినిమాలో చరణ్ గెస్ట్ రోల్!

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడని అంటున్నారు. ఆర్మీ ఆఫీసర్ గా కథను మలుపు తిప్పే పాత్రలో చరణ్ కనిపిస్తాడట. నాగబాబు నిర్మిస్తోన్న సినిమా కావడంతో చరణ్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చరణ్ ‘రంగస్థలం’ సినిమా షూటింగ్ లో గడుపుతున్నాడు.

ఈ సినిమా కోసం చరణ్ తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. గడ్డం పెంచేశాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాతే.. బన్నీ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి ‘ఎవడు’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బన్నీ స్పెషల్ రోల్ చేశాడు. ఇప్పుడు బన్నీ సినిమాలో చరణ్ స్పెషల్ రోల్ చేయబోతున్నాడు.