HomeTelugu Trending'దహనం' మూవీ పోస్టర్‌ విడుదల

‘దహనం’ మూవీ పోస్టర్‌ విడుదల

dahanam movie poster releas
పలు అవార్డులు అందుకున్న ‘దహనం’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ విడుదలైంది. ఈ పోస్టర్‌లో ఆదిత్య ఓం ఓల్డ్ గెటప్‌లో కనిపించారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించే రక్షకుడిగా కనిపిస్తున్నారు. అదారిమూర్తి సాయి తెరకెక్కించిన ఈ సినిమాకి ఇది వరకే ఎన్నో జాతీయ వేదికల మీద పలు అవార్డులు అందుకుంది. రెండు బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా వచ్చాయి.

నిర్మాతగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ డా.పి సతీష్ కుమార్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. శాంతి చంద్ర, ఎఫ్‌ఎం బాబాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎంతో ఆర్టిస్టిక్‌గా ఉన్నా కూడా అంతర్లీనంగా కులాలు, మతాల మీద ప్రశ్నించినట్టుగా ఉంటుంది. అదే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!