HomeTelugu Trendingదసరా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫిక్స్‌..

దసరా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫిక్స్‌..

dasara

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన నటించిన తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో నాని మాస్‌లో కనిపించనున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో నడుస్తుంది. ఈ చిత్రం మార్చ్ 30న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ తో నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి డేట్ ను .. వేదికను ఫిక్స్‌ చేశారు. అనంతపూర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఈ నెల 26వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కథలో ఉన్న ఒక కామన్ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందనీ, అందువల్లనే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఇప్పటికే విడుదలైన పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu