HomeTelugu Trendingదేవర @150

దేవర @150

devara movie update

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘దేవర’. ఫ్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా విడుదలైన పోస్టర్‌లకు మంచి స్పందన వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ హై వోల్టేజ్ క్యారెక్టర్ ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది అని దర్శకుడు పోస్టర్స్ తోనే రుజువు చేస్తున్నాడు.

ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ చాలా తెలివిగానే ఆలోచిస్తుంది. సినిమాకు ఎప్పుడు ఎలా హైప్ పెంచాలనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది. దేవర షూటింగ్ కూడా గ్యాప్ లేకుండా కొనసాగుతోంది. కొరటాల శివ టీం ఎక్కడ తగ్గకుండా అనుకున్న షెడ్యూల్స్ ను పక్క ప్రణాళికతో పూర్తి చేస్తోంది.

తాజాగా గోవా షెడ్యూల్ ను కూడా అనుకున్న టైం కంటే చాలా తొందరగానే పూర్తి చేశారు. ఇక ఈ సినిమా 2024 ఏప్రిల్ 5 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అంటే ఇంకా కరెక్ట్ గా 150 రోజుల సమయం మాత్రమే ఉంది. భయానికి మరొక పేరుగా దేవర పాత్ర హైలెట్ కాబోతోందని మరో పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. విలన్స్ ను చూపుతోనే భయపెట్టే హీరోగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. బైరా అనే ఆ క్యారెక్టర్ కూడా వైల్డ్ గా ఉండబోతుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ కూడా ఇటీవల విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జాన్వీ కపూర్ కనిపించబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!