రష్మిక పుట్టినరోజుకు ‘డియర్‌ కామ్రేడ్‌’ సర్‌ప్రైజ్‌?.. దేవరకొండ ట్వీట్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ చిత్రానికిక భరత్‌ కమ్మ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం రష్మిక పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఈ విషయాన్ని హీరో విజయ్‌ దేవరకొండ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘రేపు(శుక్రవారం) ఉదయం 9గంటలకు మా నుంచి రష్మికకు బర్త్‌డే స్పెషల్‌ వస్తుంది’ అంటూ పేర్కొంటూ ‘హ్యాపీబర్త్‌డే లిల్లీ’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు.

దీనికి రష్మిక స్పందిస్తూ, ‘ఆ సర్‌ప్రైజ్‌ నాకు ఒక్కదానికే తెలుసా? లేదా అందరికీ తెలుసా?నువ్వైనా చెప్పవా ప్లీజ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను యశ్‌ రాగినేని నిర్మిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు.