ధనుష్ కావాలనే తప్పించాడా..?

ధనుష్ కథానాయకుడిగా వేల్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేళై ఇల్లై పట్టాదురై’ అనే సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో.. తెలిసిందే. తెలుగులో ‘రఘువరన్ బి.టెక్’ పేరుతో విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం సమాజంలో ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ పరిస్థితులకు తల్లి సెంటిమెంట్ ను జోడించి తెరకెక్కించిన ఈ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ‘విఐపి2’ ప్రేక్షకుల ముందు రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. అయితే సెకండ్ పార్ట్ కు వేల్ రాజ్ కాకుండా ధనుష్ మరదలు సౌందర్య దర్శకత్వం వహించడానికి కారణాలు ఏంటనే చర్చ మొదలైంది.
పార్ట్ 1 అంత విజయం కావడానికి కారకుడు దర్శకుడు వేల్ రాజ్. రెండో భాగం కూడా ఆయనే డైరెక్ట్ చేయాల్సివుంది. అప్పట్లో వేల్ రాజ్ నే దర్శకుడిగా కూడా అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి మధ్యలో ఆయనను తప్పించారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అతడిని తప్పించడానికి కారణం ధనుష్ అనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై అటు ధనుష్ కానీ, సౌందర్య కానీ స్పందించలేదు. పార్ట్ 2కి కథ, మాటలు ధనుష్ అందించాడు. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విఐ‌పి ఫ్రాంచైజ్ ఇంతటితో ఆగిపోదని ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తాయని ధనుష్ అన్నారు.