తెలుగు రాష్ట్రాలకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం

కరోనా నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.