HomeTelugu Newsధనుష్ వర్కవుట్‌ వీడియో..వైరల్‌

ధనుష్ వర్కవుట్‌ వీడియో..వైరల్‌

11a 3
తమిళతో పాటు తెలుగులోనూ ఫాలోయింగ్‌ ఉన్న హీరో ధనుష్‌. కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా తన నటనతో అలరిస్తున్నారు. ఆయన ‘మారి 2’ సినిమా కోసం గతంలో చేసిన కసరత్తుల వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది. సాయిపల్లవి, వరలక్ష్మి, తోవినో థామస్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. బాలాజీ మోహన్ ఈ సినిమా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా క్లైమాక్స్‌లో ధనుష్ చొక్కా లేకుండా థామస్‌తో పోరాడతారు. ఆ సన్నివేశంలో ధనుష్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించి, అభిమానుల్ని ఆకట్టుకున్నారు. కాగా ఆ పాత్ర కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలుపుతూ.. అభిమానులు తాజాగా 30 సెకన్ల వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ధనుష్ వర్కౌట్స్‌కు సంబంధించిన అరుదైన వీడియో కావడంతో అది వైరల్‌గా మారింది. హీరో పట్లుదలకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu