బిగ్‌బాస్‌-3: కంటతడి పెట్టిన బాబా భాస్కర్


ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాబా భాస్కర్ ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏడ్చేశారు. ఉద్వేగం తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నారు. హౌస్‌లో తనవాళ్లు అనుకునేవారే తనపై నిందలు వేయడం, మాటలు అనడం వంటి విషయాలను బాబా భాస్కర్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే, స్మోకింగ్ రూంలో కూర్చొని ఏడ్చేశారు. బాబాను వరుణ్ ఓదార్చారు. ఇదంతా మన టీవీ ద్వారా చూసిన నాగార్జున ఏమిటిది బాబా అని అడగడంతో మళ్లీ ఎమోషనల్ అయ్యారు. నాగార్జున ఎదుటే కంటతడి పెట్టారు.

అందరూ ఊహించినట్టుగానే ఈవారం హౌస్ నుంచి మహేష్ ఎలిమినేట్ అయ్యాడు. సన్ డే‌ను ఫన్నీ టాస్క్‌‌తో మొదలుపెట్టిన నాగార్జున మొదట రాహుల్‌ని సేఫ్ జోన్‌లో వేశారు. ఇక మిగిలింది వరుణ్, మహేష్. కాసేపు అమ్మ తోడు అంతా నిజమే చెప్తా అనే టాస్క్‌ను ఆడించిన కింగ్.. ఆ తరవాత ఫైనల్‌గా మహేష్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. మహేష్ ఎలిమినేషన్‌ కావడంతో ఎవరూ పెద్దగా ఫీలయినట్టు కనిపించలేదు. సరదాగా, నవ్వుతూ సాగనంపేశారు. ఇంటిలో నుంచి బయటికి వస్తూ బాబా భాస్కర్ కాళ్లకు మహేష్ నమస్కారం చేశాడు. ఇక హౌస్‌లో బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్, అలీ, శివజ్యోతి, వరుణ్, వితికా ఉన్నారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చేవారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్టు సమాచారం.