దిల్ రాజు @100 కోట్లు!

డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుతున్న దిల్ రాజుకి ఈ ఏడాది బాగా కలిసొచ్చినట్లుంది. శతమానం భవతి, నేను లోకల్ వంటి చిత్రాలతో మంచి లాభాలను ఆర్జించాడు. నమో వెంకటేశాయ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు రోబోయే రోజుల్లో మొత్తం దిల్ రాజు హవానే కొనసాగబోతోంది. మహేష్ బాబు నటిస్తోన్న ‘స్పైడర్’ సినిమాను నైజాంలో పాతిక కోట్లకు తీసుకోబోతున్నారు. అలానే పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ ల సినిమా 30కోట్లలో డీల్ చేయబోతున్నారు.
దాదాపుగా ఆ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ నైజాం డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజుదే కాబట్టి సినిమా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక వీటితో పాటు ఆయన సొంత సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ నైజాం హక్కులు ఆయన దగ్గరే ఉంచుకుంటారు. అవి మరొక 20 కోట్ల వరకు ఉండొచ్చు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’ సినిమా కూడా దిల్ రాజుదే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఎంత వాల్యూ ఉండచ్చనే విషయంలో క్లారిటీ లేదు. కనీసం 20 కోట్లకు పైనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం కలుపుకుంటే వంద కోట్లకు దగ్గరే.. నైజాంలో ఆయన చేయబోయే బిజినెస్. మరి ఈ సినిమాల ద్వారా ఆయనకు ఎంత లాభం వస్తుందో.. చూడాలి!