HomeTelugu Trendingనాని వ్యాఖ్యలపై దిల్‌రాజు స్పందన

నాని వ్యాఖ్యలపై దిల్‌రాజు స్పందన

dil raju
టాలీవుడ్ యంగ్‌ హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్లను తగ్గించడంపై నాని తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో ఐక్యత లేదు అని, వకీల్ సాబ్ సినిమా అప్పుడు మొదలైన ఈ సమస్యకు అప్పుడే పరిష్కారం వెతకాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. నాని వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు పెదవి విరుస్తుండగా.. మరికొందరు ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఇక తాజాగా నాని వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివరణ ఇచ్చారు. నేడు శ్యామ్ సింగరాయ్ సక్సెస్ మీట్ కి అతిధిగా విచ్చేసిన దిల్ రాజు ఈ విషయంపై మాట్లాడుతూ ..’ ఇటీవల నాని చేసిన వ్యాఖ్యలను అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. నాని చెప్పిన విషయం వేరు.. అది వెళ్లిన తీరు వేరు. నేను, నానితో చేసిన వి మూవీ ఓటిటీ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడు కూడా నానికి, డిస్టిబ్యూటర్స్ కి గొడవ అయ్యింది. ఇలా రెండు సినిమాలు ఓటిటీ కి వెళ్లి వచ్చాకా ఇప్పుడు తన సినిమా థియేటర్లో రిలీజ్ కావడం, ఇలాంటి సమయంలో టికెట్ ఇష్యూ రావడం వలన, ఒక హీరోగా కష్టపడే మనస్తత్వంతో ఉన్న నాని ఎమోషనల్ అయ్యి అలా రియాక్ట్ అయ్యాడు.

తను చెప్పిన ఫీలింగ్ వేరు.. అందరికి అర్థమైన అయిన విధానం వేరు. నాని చెప్పిన మాటల వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్నది ఎంతమంది. సినిమాలకు , ప్రేక్షకులకు , ప్రభుత్వానికి మధ్య ఉన్న గోడ మీడియా. మీరు ఏది చూపిస్తే అదే ప్రేక్షకులకు చూస్తారు. అలాంటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నాని బాధ వేరు.. రెండు సినిమా ల తరువాత వస్తున్నా సినిమా కాబట్టి ఆ మాత్రం రియాక్ట్ కావాల్సిన అవసరం తనకుంది. అందుకే తను రియాక్ట్ అయ్యాడు.. అంతేకాని నెగెటివ్ గా రిచ్ అయ్యేలా మాత్రం నాని మాట్లాడలేదు.. అర్ధం చేసుకోండి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!