దాసరి, పవన్ ల సినిమాకు డైరెక్టర్ దొరికాడా..?

పవన్ కల్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు ఓ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశాడు. దీనికి పవన్ కూడా అంగీకరించాడని మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు పవన్ ఉన్న పరిస్థితుల్లో సినిమా చేస్తాడా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముందుగా పవన్ ‘కాటమరాయుడు’ సినిమా
షూటింగ్ పూర్తి చేయాలి. దీని తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా, అలానే తమిళ దర్శకుడు నేసన్ దర్శకతంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇవన్నీ పూర్తయ్యేసరికి వచ్చే ఏడాది వేసవి పూర్తవుతుంది.

ఆ తరువాత పవన్ ఎన్నికల్లో బిజీ అయిపోవడం ఖాయం. కానీ దాసరి మాత్రం పవన్ తనకు డేట్స్ ఇస్తాడనే నమ్మకంతోనే ఉన్నాడు. తమిళంలో అజిత్ హీరోగా వరుస హిట్స్ ను రూపొందిస్తున్న శివతో కలిసి పవన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే శివ, దాసరి నారాయణరావు ఇద్దరు కలిసి పవన్ దగ్గరకు వెళ్ళినట్లు సమాచారం. పవన్ అటు ఓకే.. చెప్పలేదు.. అలా అని నో కూడా చెప్పలేదట. దీంతో పవన్ తన మాట కాదనడనే దాసరి భావిస్తున్నాడు.