డైరెక్టర్ గా మారుతోన్న మహేష్ సోదరి!

సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల గతంలో సినీరంగ ప్రవేశం చేసి నటిగా, నిర్మాతగా
మంచి పేరు తెచ్చుకుంది. పోకిరి, ఏ మాయ చేసావే వంటి విజయవంతమైన చిత్రాలను
నిర్మించిన ఆమె ప్రస్తుతం దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. దీనికి సంబంధించి
ఆమె స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతోందట. అయితే ఈ సినిమాలో ఓ
యువహీరోను ఎంపిక చేసుకోవాలని ఆమె నిర్ణయం తీసుకుంది. దానికోసం హీరో సందీప్
కిషన్ అయితే బావుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రానికి ఆమె
నిర్మాణ బాధ్యతలు కూడా చేపడతారేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి
మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.

CLICK HERE!! For the aha Latest Updates