మహేష్ సినిమాకు భారీ ప్రీరిలీజ్ బిజినెస్!

స్పైడర్ రిలీజ్ టైం లో మహేష్ చాలా ఇంటర్వూస్ ఇచ్చాడు. ఆ సందర్భంలో తన జీవితంలో ఇప్పటివరకు జరిగిన చాలా విషయాల గురించి మాట్లాడాడు. మహేష్ మాటలతో చాలా అటెన్షన్ తెచ్చుకున్న స్పైడర్ రిజల్ట్ పై ఇప్పటికి క్లారిటీ లేదు.కానీ అది మహేష్ ఊహించినంత విజయాన్ని అయితే అందించలేదు అనేది ఒప్పుకోవాల్సిన పాయింట్. స్పైడర్ ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూ లో ఫ్లాప్స్ వచ్చినప్పుడల్లా నా మార్కెట్ పెరిగింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మహేష్. ఆ టైం లో అది వింతగా అనిపించినప్పటికీ ఇప్పడు మాత్రం అది అక్షరాలా నిజమే అనిపిస్తుంది.

ఒక టైం లో మహేష్ సినిమాలకి దూరంగా ఉన్నాడు. కానీ ఆ టైం లో మహేష్ కి ఇండియా లోనే టాప్ బ్రాండ్స్ అంబాసడర్ గా నియమించుకుని కోట్లలో రెమ్యూనిరేషన్ ఇచ్చాయి. అవి ఏ రేంజ్ లో అంటే ఏకంగా మహేష్ ఒక కాస్ట్లీ ఇల్లు కట్టుకునే రేంజ్ లో. ఇప్పడు కూడా అదే రేంజ్ మ్యాజిక్ రిపీట్ అవబోతుంది. కాకపోతే ఈ సారి సినిమాతో. ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న సినిమా భరత్ అను నేను శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కొన్ని బిలీవబుల్ సోర్సెస్ ప్రకారం ఈ సినిమాకి ఇప్పటికే రికార్డ్ స్థాయిలో 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

పైగా ఇంకా కొన్ని పెద్ద ఏరియాలు ఇంకా అమ్మాల్సి ఉంది.అవన్నీ కలుపుకుంటే ఇది స్పైడర్ కంటే ఎక్కువగా బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఇది కంట్రోల్డ్ బడ్జెట్ లోనే తెరకెక్కుతుంది. పైగా శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లోవస్తున్న సినిమా కావడంతో ఎక్కడ చూసినా సినిమాపై అంతా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. సో,ఎలా చూసుకున్నా కూడా ఇది సేఫ్ వెంచర్.అందరికి కూడా లాభాలు సంపాదించిపెట్టే సినిమాగా భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న భరత్ అను నేను మహేష్ బాబు బిజినెస్ రేంజ్ ని మాత్రం ఒక రేంజ్ లోపెంచింది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 2018 సమ్మర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు.