అఖిల్ విలన్ ఇతడే!

అక్కినేని అఖిల్ మొదటి సినిమా పరాజయం తరువాత ఎన్నో జాగ్రత్తలు తీసుకొని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతోంది. అఖిల్ మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయంలో ఓ స్పష్టత వచ్చింది. విక్రమ్ కుమార్ రూపొందించిన ‘ఇష్క్’,’24’ వంటి సినిమాల్లో నటించిన నటుడు అజయ్ ను అఖిల్ సినిమాలో విలన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.

సినిమాలో విలన్ పాత్రను ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దారట దర్శకుడు. ఆ రోల్ విన్న వెంటనే అజయ్ నటించడానికి ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ లో అజయ్ కూడా పాల్గొన్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా ‘ఎక్కడ ఎక్కడ ఉందో తారక’ అనే పేరును పరిశీలిస్తున్నారు.