బాబాయ్ తో పోటీకి సిద్ధంగా లేడట!

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు. కానీ ఇప్పుడు చిత్రబృందం సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ల సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారనే కారణంగా తమ సినిమా కూడా అదే సమయానికి రావడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. తన బాబాయ్ తో సినిమాతో చరణ్ తన సినిమాను పోటీగా దింపడానికి ఇష్టపడడంలేదు.

దీంతో దర్శకనిర్మాతలను పవన్ సినిమా రాకముందే ‘రంగస్థలం’ను రిలీజ్ చేస్తే మంచిదని చెబుతున్నాడట. గతంలో కూడా చరణ్ తన దృవ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకొని ‘ఖైదీ నెంబర్ 150’ కూడా అదే సమయంలో వస్తుందని డిసంబర్ లోనే తన సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు తన బాబాయ్ కోసం పండగ అడ్వాంటేజ్ ను వదులుకోబోతున్నాడు.