HomeTelugu Big Storiesప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న రాజమౌళి

ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న రాజమౌళి

Director Rajamouli received
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి గత ఏడాది తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఎంపిక అయిన విషయం తెల్సిందే. తాజాగా రాజమౌళి ఆ అవార్డును అందుకున్నారు. కుర్తా తో భారతీయ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా రాజమౌళి ఆ ప్రతిష్టాత్మక అవార్డును అందుకునేందుకున్నారు. అవార్డును అందుకున్న సందర్భంగా రాజమౌళి మాట్లాడిన మాటలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. సరదాగా తన రెండు కాళ్లు వణుకుతున్నాయి అంటూ స్పీచ్ ను మొదలు పెట్టాడు.

తన యొక్క కాళ్లను కవర్ చేసే విధంగా ఈ డ్రెస్ ను ఇచ్చినందుకు నా ఫ్యాషన్ డిజైనర్ కి కృతజ్ఞతలు. ఇక మా సినిమాను అమెరికాలో ఇంత భారీగా విడుదల అవ్వడం లో సహకరించిన మా డిస్ట్రిబ్యూషన్ సంస్థ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇండియాలో అద్భుతమైన సినిమాలు.. నమ్మశక్యం కాని సినిమాలు రూపొందుతున్నాయని జక్కన్న పేర్కొన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు అమెరికాలో వచ్చిన స్పందన మర్చిపోలేను. పశ్చిమంలో నేను ఆర్ఆర్ఆర్ హిస్టీరియా ను చూసి ఆశ్చర్యపోయాను. ఇక తన సినిమాలు మరియు సినిమాల్లోని హీరోల పాత్రల గురించి స్పందిస్తూ.. నా హీరోలు సూపర్ హ్యూమన్స్ గా ఉండాలి అనుకుంటాను. అయితే బలమైన భావోద్వేగంతో వారు తమలోని సూపర్ పవర్ ను చూపించాలని నేను భావిస్తాను.

ఇక తన ముందు ముందు సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను అలరించే దిశగా తీయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమా తీస్తాను అంటూ స్టేజ్ పై జక్కన్న ప్రామిస్ చేశాడు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!