బాహుబలి రీరిలీజ్!

బాహుబలి ది బిగినింగ్ సినిమాను మళ్ళీ విడుదల చేస్తున్నారు మేకర్స్. హిందీ వెర్షన్ రీరిలీజ్ కోసం ఆ రేంజ్ లో పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ నెలాఖరున బాహుబలి పార్ట్ 2 విడుదలవుతున్న నేపధ్యంలో ఒకసారి మొదటి పార్ట్ ను కూడా విడుదల చేస్తే బావుంటుందని మేకర్స్ ఈ విధంగా ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని ఇటీవల రాజమౌళి కూడా వెల్లడించారు. బాలీవుడ్ లో సినిమాను రిలీజ్ చేస్తోన్న కరణ్ జోహర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.

గతంలో ఇలానే సినిమాలను రీరిలీజ్ చేసేవారు. థియేటర్లో నుండి సినిమాను తీసేసిన కొన్ని రోజులకు మళ్ళీ ఆ సినిమాను రీరిలీజ్ చేసేవారు. ఇప్పుడు అయితే సినిమా వారం రోజులు ఆడితే గగనం.. ఆ తరువాత మళ్ళీ థియేటర్ లో కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాహుబలి రీరిలీజ్ అంటే గొప్ప విషయం. మరి వసూళ్ల విషయంలో కూడా మరోసారి రికార్డ్ క్రియేట్ చేస్తుందేమో.. చూడాలి!