HomeTelugu Trending'దిశ ఎన్‌కౌంటర్‌' పోస్టర్ రిలీజ్

‘దిశ ఎన్‌కౌంటర్‌’ పోస్టర్ రిలీజ్

Disha encounter poster rele
వివాదాస్పద అంశాలనే తన సినిమాకు కథలుగా ఎంచుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్సీలకు మారుపేరు ఆర్జీవీ. సమాజంలో జరుగుతున్న అంశాల పైన సినిమాలు తీసే వర్మ హైదరాబాద్‌ శివారులో జరిగిన దిశ ఘటనను సినిమాగా తీస్తానని అప్పట్లోనే ప్రకటించాడు. దిశ ఎన్‌కౌంటర్ పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశాడు. ఇందులో ఒక లారీ, స్కూటీ అలాగే ఓ వ్యక్తి చేతిలో గన్ కనిపిస్తున్నాయి. 2019వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన దిశపై నలుగురు యువకులు అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా హత్యచేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ కేసులో నిందితుల్లో చెన్నకేశవులు భార్యను వర్మ కలిసిన విషయం తెలిసిందే. అప్పుడు శంషాబాద్ పోలీసులను కూడా కలుసుకున్నారు. పబ్లిసిటీలో వర్మను మించిన వారు లేరనే చెప్పాలి. వర్మ విడుదల చేసిన ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!