HomeTelugu Trendingదిశాపటానీ సీక్రెట్ బయటపెట్టిన టైగర్ ష్రాఫ్ సోదరి

దిశాపటానీ సీక్రెట్ బయటపెట్టిన టైగర్ ష్రాఫ్ సోదరి

3 24
తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో తెరంగేట్రం చేసిన దిశ పటానీ ఆ తరువాత బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. బాఘి-2, మలంగ్, బాఘి-3 సినిమాలతో హిట్లు అందుకుంది. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో రాధే సినిమాలో నటిస్తోంది. అయితే దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగా పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి మీడియా కంట పడుతున్నారు. దీనిపై ప్రశ్నించగా మేం మంచి స్నేహితులం అని మాత్రమే చెప్తున్నారు. దేశమంతటా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఇప్పుడు దిశా తన బోయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్‌ ఇంట్లో ఉంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎందుకంటే టైగర్ ష్రాఫ్ సోదరి
కృష్ణ ష్రాఫ్ తన ఫొటోను షేర్‌ చేస్తూ తనకు దిశా మేకప్ చేసిందని కామెంట్ చేయడమే దీనికి కారణం.

దీనిపై స్పందించిన కృష్ణ ష్రాఫ్ దిశతో తమ కుటుంబానికి ఉన్న సంబంధం గురించి బయట పెట్టింది. దిశ తమతో కలిసి ఉండటం లేదని తను మా ఇంటికి దగ్గరలోని ఉంటుందని వెల్లడించింది. టైగర్, దిశ, నేను మంచి స్నేహితులం. మా ముగ్గురికీ ఫిట్‌నెస్ అంటే చాలా ఇష్టం. అలా మామధ్య స్నేహం కుదిరింది. అందుకే మేం చాలా ఫొటోలు, వీడియోల్లో
కలిసి కనిపిస్తాం అని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!