‘డిజె’ కథ ఇదేనా..?

దువ్వాడ జగన్నాథమ్ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో సుమారు వెయ్యి థియేటర్స్‌లో విడుదలౌతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొందరు ఈ సినిమాను టెక్నాలజీను ఉపయోగించి చూశామని ఓ కథను లీక్ చేశారు. ఆ స్టోరీ వైపు మీరు ఓ లుక్కేయండి.
”ఓ అగ్రహారంలో వంట మనిషిగా పనిచేస్తుంటాడు. ఏ ఫంక్షన్ జరిగినా అన్నీ తానై చూసుకొంటాడు. ఓ ఫంక్షన్‌లో పూజా హెగ్డేతో పరిచయం అవుతుందట. తొలిచూపులోనే ఆమెను జగన్నాథం ప్రేమిస్తాడు. అగ్రహారంలో బ్రహ్మణుల పేరు మీద ఉన్న కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి ఉంటుంది. దానిని ఎలాగైనా కబ్జా చేయాలని రొయ్యల నాయుడు (రావు రమేశ్) ప్లాన్ వేస్తాడు.
మాఫియా డాన్‌తో.. ఫారిన్ కేంద్రంగా చేసుకొని అక్రమ దందా చేసే మాఫియా డాన్ ఇదే భూమిపై కన్నేస్తాడు. తన అనుచరులకు పురమాయిస్తాడు. మాఫియా డాన్ గ్యాంగ్‌ను ఆటకట్టించి విలన్ ఎదుర్కొనేందుకు డీజేగా మారి విదేశాలకు వెళ్తాడు. అక్కడ విలన్‌ను చూసిన డీజే షాక్ గురవుతాడట. మాఫియా డాన్‌ను చూసి డీజే ఎందుకు షాక్ అయ్యాడు. డీజేకి, మాఫియా డాన్‌కు సంబంధమేమిటి. దువ్వాడ జగన్నాథం అసలు కథ ఏంటి? జగన్నాథంగా ఎందుకు మారాడు? రొయ్యల నాయుడు ఆటలను ఎలా కట్టించాడు, పూజా, అల్లు అర్జున్ ప్రేమకథ ఎలా ముగింపు కార్డు పడింది అనే ప్రశ్నలకు సమాధానమే దువ్వాడ జగన్నాథం కథ.” కథ మాత్రం రొటీన్ గా ఉంది. మరి ఇదే కథ అయితే గనుక హరీష్ తన స్క్రీన్ ప్లే తో మాయ చేయాల్సిందే. మరి ఈ కథలో ఎంతవరకు నిజముందో కొద్ది గంటల్లో తెలియబోతుంది!