HomeTelugu Big StoriesGame Changer ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే!

Game Changer ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే!

Here's the much-awaited first review of Game Changer!
Here’s the much-awaited first review of Game Changer!

Game Changer First Review:

రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమా గేమ్ చేంజర్ జనవరి 10, 2025న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు అనజలి, ఎస్.జే సూర్య, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తోడుగా సముతిరకని, శ్రీకాంత్, సునీల్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. 162 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా సంక్రాంతికి ఓ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచే అవకాశం ఉందా లేదా ఇప్పుడు చూద్దాం.

ఫస్ట్ హాఫ్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీ కెమిస్ట్రీ అలరిస్తే, సెకండ్ హాఫ్‌లో శంకర్ స్టైల్ ఎమోషనల్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

కథ:

కథ రెండు విభిన్న పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఒకవైపు క్రమశిక్షణతోనూ, ప్రజల కోసం పోరాటంతోనూ నిలిచే K రామ్ నందన్ IAS, మరోవైపు సింపుల్‌గా, జీవితాన్ని ప్రేమించే ఆపన్న పాత్రలో రామ్ చరణ్ రెండు వైపులా తన ప్రతిభను చూపించారు. కథలో రాజకీయ కుట్రలు, కుటుంబ బంధాలు ప్రధానంగా కనిపిస్తాయి.

నటీనటులు:

రామ్ చరణ్ రెండు పాత్రలలోను చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా IAS పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎస్‌.జే.సూర్య విలన్ పాత్రలో సూర్య తన మార్క్ చూపించారు. కానీ ఇది టిపికల్ తెలుగు విలన్‌లా కనిపించడం ఒక చిన్న మైనస్. కియారా అద్వానీ గ్లామర్ పాత్రలో మాత్రమే కనిపించినా, ఆమె తన వర్క్‌కి న్యాయం చేశారు. ప్రకాశ్ రాజ్, అంజలి, సముతిరకని ఈ మూడు పాత్రలు కథనానికి బలాన్నిచ్చాయి.

సాంకేతిక అంశాలు:

శంకర్ మునుపటి సినిమాల లాగా కొన్ని అవుట్ డేటెడ్ అంశాలు ఇక్కడ కూడా కనిపించాయి. అయితే, కొన్ని సన్నివేశాల్లో శంకర్ మార్క్ మెరుస్తుంది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. తిరు గ్రాండ్ విజువల్స్ అందించి సినిమాకు మెరుగైన లుక్ ఇచ్చారు. వీఎఫ్ఎక్స్ మంచి స్థాయిలోనే ఉన్నా, కొన్ని చోట్ల అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు.

ప్లస్ పాయింట్స్:

*రామ్ చరణ్ నటన
*శంకర్ మార్క్ ఎమోషన్ సన్నివేశాలు
*ఇంటర్వెల్ సీక్వెన్స్
*సోషల్ మేసేజ్
*ఫ్లాష్‌బ్యాక్ సీన్స్

మైనస్ పాయింట్స్:

-కొత్తదనం లేని కొన్ని సన్నివేశాలు
-కియారా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం లేకపోవడం
-శంకర్ హిట్ సినిమాల లాగా కొత్తదనం లేకపోవడం

తీర్పు:

గేమ్ చేంజర్ భారీ అంచనాలతో వచ్చినా, అవి పూర్తిగా అందుకోలేకపోయింది. అయితే, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టే అవకాశం ఉంది. కేవలం కమర్షియల్ సినిమాగా చూస్తే ఇది పండుగకు మంచి ఎంటర్‌టైనర్ అని చెప్పచ్చు.

రేటింగ్:

3.25/5

ALSO READ: Game Changer కోసం సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ షూటింగ్ చేస్తున్నారా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu