నాన్ బాహుబలి రికార్డ్ గెలుచుకుంటుందా..?

‘బాహుబలి2’ వంటి భారీ సినిమా తరువాత విడుదలవుతున్న పెద్ద సినిమా ‘దువ్వాడ జగన్నాథం’. ఈ పాయింట్ డిజె కి బాగా కలిసొస్తుంది. అన్ని ఏరియాల్లో బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. బయ్యర్లు భారీ మొత్తాలకు సినిమాను కొనుగోలు చేస్తుంటే వారి వద్ద నుండి ఎగ్జిబిటర్లు, ధర్డ్ పార్టీలు మరింత ఎక్కువ డబ్బు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ డబ్బు మొత్తం రికవరీ చేయాలంటే.. టికెట్ రేట్ పెంచక తప్పదు. బాహుబలి2 సినిమా టైమ్ లో కూడా సినిమా టికెట్స్ డబుల్ రేట్లకు అమ్మారు.
ఇప్పుడు ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ కాబోతుంది. టికెట్ రేట్లను డబుల్ చేయబోతున్నారు. అంతేకాదు రోజుకి అయిదు షోల పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాదించుకోవచ్చు. ఆ తరువాత నుండి వచ్చేవి లాభాలే. ఈ అదనపు షోలు, పెంచబోయే టికెట్ రేట్ వల్ల ఓపెనింగ్స్ పరంగా సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ ను సాధిస్తుందేమో చూడాలి..!