మలయాళ సినిమాలో తమన్నా!

మలయాళ సినిమాలో తమన్నా!
ఇప్పటివరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఇప్పుడు మలయాళం 
సినిమాలో కూడా మెరవడానికి సిద్ధంగా ఉంది. రతీష్ అంభట్ అనే దర్శకుడు రూపొందిస్తోన్న 
‘కుమారసంభవం’ అనే సినిమాలో హీరోయిన్ గా తమన్నా ను సంప్రదించగా కథ నచ్చి వెంటనే 
ఓకే చెప్పేసింది మిల్కీ బ్యూటీ. ఈ సినిమా హీరో సిద్ధార్థ్ తో పాటు దిలీప్ అనే మరో మలయాళ 
నటుడు కూడా నటిస్తున్నాడు. సిద్ధార్థ్ కు కూడా మలయాళంలో ఇదే మొదటి సినిమా. సినిమాలో 
వీరి ముగ్గృ పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుందట. తమన్నా ప్రస్తుతం బాహుబలి, అభినేత్రి సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల కమిట్మెంట్స్ తో బిజీగా గడుపుతోంది. ఈ నేపధ్యంలో తనకు ఎంతమంది కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా.. ఒప్పుకోలేదు.. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ మాత్రం బాగా ఆకట్టుకుంది. అందుకే వెంటనే ఓకే చెప్పేసింది.