ఇకపై సినిమాల్లో నటించనంటున్న కమల్‌

విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో ఇప్పుడిప్పులే నిమగ్నమవుతు.. మరోపక్క సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఇండియన్ 2’ చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా తన రాజకీయ ఉద్దేశ్యాల్ని ప్రజలకి చెప్పాలనుకుంటున్నారు కమల్. అంతేకాదు ఇదే తన చివరి సినిమా అని, ఇకపై సినిమాల్లో నటించబోనని, పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయిస్తానని కూడ అన్నారు కమల్. శంకర్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates