HomeTelugu Trendingహీరో: ర్యాప్ సాంగ్ విడుదల

హీరో: ర్యాప్ సాంగ్ విడుదల

DonalDaggu Lyrica song from
అశోక్ గల్లా నటిస్తున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ దేవరాజ్‌తో కలిసి రోల్ రైడా వ్రాసి, పాడిన ‘హీరో’ సినిమా నుంచి ర్యాప్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అశోక్ గల్లా తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ ఫ్లోర్‌ ను దద్దరిల్లేలా చేస్తున్నాడు.

గిబ్రాన్ అందించిన ఈ మాస సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో గ్రాండ్ సెట్‌లు, అద్భుతమైన ఫోటోగ్రఫీతో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!