HomeTelugu Big Stories'సన్‌ ఆఫ్‌ ఇండియా' టీజర్‌ వచ్చేసింది

‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ టీజర్‌ వచ్చేసింది

Son of India Movie Teaser

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ – శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకాలపై మంచు విష్ణు ఈ మూవీని నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ప్రారభమైంది. ఈ టీజర్ లో విలక్షణ మోహన్‌ బాబు తనదైన శైలిలో చెప్పే డైలాగ్ అలరిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ‘ఓన్లీ వన్స్ ఫసక్’ మాదిరిగా చివర్లో ‘నేను కసక్ అంటే మీరందరూ ఫసక్’ అని మోహన్ బాబు చెప్పడం గమనార్హం. ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో మోహన్ బాబుకు స్టైలిస్ట్ గా ఆయన కోడలు విరానికా మంచు వర్క్ చేస్తున్నారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమాకి సంబంధించిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు, రవి ప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu