HomeTelugu Trendingస్వాతిముత్యం: 'డుమ్ డుమ్ డుమ్' సాంగ్‌ విడుదల

స్వాతిముత్యం: ‘డుమ్ డుమ్ డుమ్’ సాంగ్‌ విడుదల

Dum Dum Dum Lyrical from Sw
టాలీవుడ్‌ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, బెల్లంకొండ శ్రీనివాస్‌ తమ్ముడు గణేశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాతో, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. ‘డుమ్ డుమ్ డుమ్ డుమ్ మోగింది మేళం ..’ అంటూ ఈ పాట సాగుతోంది.

కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటని ఆదిత్య బృందం ఆలపించింది. అబ్బాయి .. అమ్మాయి గుణగణాలతో పాటు, పెళ్లి తంతుకి సంబంధించిన హడావిడిని ప్రతిబింబిస్తూ సాగిన పాట ఇది. ఈ సినిమాలో.. నరేష్ వీకే, రావు రమేష్ , సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సునయన రావు రమేశ్, నరేశ్, ప్రగతి, శ్రీవాణి తదితరులు నటిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu