ఊరు పేరు భైరవకోన: నిజమేగా సాంగ్‌.. విడుదల


టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ ఇటీవలే నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘మైకేల్‌’ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సందీప్‌ కిషన్‌. ఆ సినిమా పేరే ‘ఊరు పేరు భైరవకోన’.

ఒక ప్రత్యేకమైన జోనర్లోని సినిమాలను చేసుకుంటూ వెళుతున్న వీఐ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. గతంలో ఆయన నుంచి వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ … ‘ఒక్క క్షణం’ చూస్తే, ఆయన మార్క్ సినిమాలు ఎలా ఉంటాయనేది తెలుస్తుంది. అలాంటి ఒక ఆసక్తికరమైన లైన్ పైనే ‘ఊరుపేరు భైరవకోన’ నడవనుంది.

ఈ సినిమాలో సందీప్ కిషన్ జోడీగా వర్ష బొల్లమ్మ నటిస్తుంది. ఈ సినిమాను రాజేశ్ దండ – బాలాజీ నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘నిజమేగా చెబుతున్నా జానే జానా .. నిన్నే నే ప్రేమిస్తున్నా’ అంటూ సాగుతోంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సాంగ్‌ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates