ఎన్టీఆర్ సినిమాకు ఆ హీరో హ్యాండ్ ఇచ్చేశాడు!

కన్నడ నటుడు దునియా విజయ్.. ఎన్టీఆర్ ‘జైలవకుశ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించిన విజయ్ ఇప్పుడు ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కన్నడలో అతడు నటించిన సినిమా విడుదలకు సిద్ధం చేయాల్సి ఉండడంతో తాను డేట్స్ ఇచ్చిన సమయానికి షూటింగ్ కు రాలేనని స్వయంగా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి మరీ చెప్పేశాడట. భవిష్యత్తులో అవకాశం ఉంటే ఖచ్చితంగా మరో సినిమాలో నటిస్తానని, ఏమీ అనుకోవద్దని చెప్పారట. 
దీంతో అతడి స్థానంలో మరో నటుడ్ని తీసుకునే ప్రయత్నంలో పడ్డాడు దర్శకుడు బాబీ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఆగస్ట్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాల్ని మరింత పెంచేశాయి.