Tollywood Star Hero Wife in Bollywood:
బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్ సినిమాలు అందుకుని.. ఒక Tollywood Star Hero తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని హైదరాబాద్లోనే సెటిల్ అయిన హీరోయిన్ గురించి మీకు తెలుసా? ఆమె మరెవరో కాదు నమ్రత శిరోద్కర్. ఆమె పేరు టాలీవుడ్‌లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి, ఆ తర్వాత అందాల రాణిగా పేరు తెచ్చుకున్నారు నమ్రత.
నమ్రత 1977లో బాలీవుడ్‌లో బాలనటిగా శిర్డీ కే సాయి బాబా చిత్రంతో పరిచయమైంది. చిన్న పాత్ర అయినప్పటికీ, అది ఆమె సినీ రంగంలో అడుగుపెట్టడానికి మొదటి అడుగు. ఆ తరువాత 1993లో నమ్రత మిస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుని, మిస్ యూనివర్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఆ పోటీలో ఆరో స్థానంలో నిలిచింది. ఇది ఆమెకు సినీ పరిశ్రమలో బోలెడు అవకాశాలు అందుకునేలా చేసింది.
నమ్రత ప్రధాన పాత్రలో నటించిన మొదటి చిత్రం పూరబ్ కీ లైలా ఔర్ పశ్చిమ కా చైలా విడుదల కాకుండానే ఆగిపోయింది. 1998లో సల్మాన్ ఖాన్‌తో నటించిన జబ్ ప్యార్ కిసిసే హోతా హైతో ఆమె మళ్ళీ హీరోయిన్ గా పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కానీ, తర్వాతి చిత్రం మెరే దో అన్‌మోల్ రతన్ పెద్దగా సక్సెస్ కాలేదు.
1999లో విడుదలైన వాస్తవ్ సినిమా ఆమెకు గొప్ప విజయాన్ని అందించింది. సంజయ్ దత్‌తో కలిసి నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ తర్వాత నటించిన హీరో హిందుస్తానీ, కచ్చే ధాగే, ఆఘాజ్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. మొత్తం 16 సినిమాల్లో నటించినప్పటికీ, వాటిలో చాలా ఫ్లాప్‌లు అయ్యాయి.
అదే సమయంలో సౌత్ చిత్రరంగంలో వంశీ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించిన నమ్రత.. షూటింగ్ సమయంలో ప్రేమలో పడింది. ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2005లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. మహేష్ బాబు తో పెళ్లి తర్వాత నమ్రత నటనకు స్వస్తి చెప్పి.. కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి.. సినిమాకి దూరంగా అంటూ హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు.
Read More: Bigg Boss 8 Telugu నుండి ఈవారం ఎలిమినేట్ అవ్వబోతున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా?