HomeTelugu Newsఓటీటీలో 'ఏక్‌ మినీ కథ'

ఓటీటీలో ‘ఏక్‌ మినీ కథ’

Ek Mini Katha in ott
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ చేయాలని చూసిన చాలా సినిమాలు ఓటీటీలో విడుదలకు సిద్ధమౌతున్నాయి. ఈ క్రమంలో ”ఏక్ మినీ కథ” చిత్రాన్ని కూడా డిజిటల్ రిలీజ్ కి రెడీ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. మే 27న ఈ సినిమా విడుదల కానున్నట్లు పేర్కొంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని రిలీజ్‌ చేశారు. కాగా ఈ సినిమా ఇప్పటికే (ఏప్రిల్ 30న) థియేటర్స్‌లో విడుదల కావల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేసుకున్నారు.

సంతోష్ శోభన్, కావ్యా థాపర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఏక్ మినీ కథ’. శ్రద్ధాదాస్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ‘ఏక్ మినీ కథ’ సినిమాని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu