HomeTelugu Newsపాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన FATF-APG

పాకిస్థాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన FATF-APG

13 7
ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోని పాకిస్థాన్‌కు FATF ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రే లిస్ట్‌లో ఉన్న దాయాది దేశాన్ని ఎన్‌హాన్స్‌డ్ ఎక్స్‌పెడిటెట్ ఫాలో అప్ లిస్ట్(బ్లాక్‌ లిస్ట్‌)లో చేర్చింది. ఈ మేరకు గత రెండు రోజులుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌-ఏపీజీ సమావేశంలో నిర్ణయించినట్లు భారత అధికారులు తెలిపారు. ఉగ్రవాద నిర్మూలన దిశగా తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను పాక్‌ ఇటీవల ఎఫ్‌ఏటీఎఫ్‌కి సమర్పించింది. పాక్‌ తీసుకున్న దాదాపు 40 రకాల చర్యల్లో దాదాపు 32 ఎఫ్‌ఏటీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా లేవని ఆసియా-పసిఫిక్‌ గ్రూప్‌ కుండబద్దలు కొట్టింది. అలాగే ఉగ్రవాదులకు నిధుల చేరవేత, అక్రమ నగదు చలామణి లాంటి కీలకమైన 11 విషయాల్లో పాక్‌ 10 అంశాల్లో లక్ష్యాల్ని చేరుకోలేదని స్పష్టం చేసింది. 42 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పాక్‌ చర్యలతో ఏ ఒక్కరూ సంతృప్తి చెందనట్లు సమాచారం. ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే అంశంలో పాక్‌ తీసుకున్న చర్యలు ఎఫ్‌ఏటీఎఫ్‌ నిబంధనలకు అనుగుణంగా లేవని సభ్యులు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu