ఫిలింఫేర్ హైలైట్స్!

64వ జియో ఫిలింఫేర్ అవార్డ్స్ శనివారం హైదరాబాద్ లో జరిగాయి. దక్షిణాది అన్ని భాషలకు చెందిన సినీతారలందరూ ఈ వేడుకకు తరలి వచ్చారు. ఈ వేడుకలో ప్రతిభ కనబరిచిన ఆయా భాషలకు చెందిన నటీనటులకు, సాంకేతికనిపుణులకు అవార్డ్స్ అందించారు. అయితే ఈ వేడుకలో చోటు చేసుకున్న కొన్ని హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం!
*ముందుగా ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారాన్ని డా.విజయ నిర్మలకు అందించారు. ఈ అవార్డ్ కృష్ణ చేతుల మీదుగా అందివ్వడం విశేషమని చెప్పాలి. ఈ అవార్డ్ ప్రకటించిన వెంటనే అక్కడున్న సినీతారలు, అభిమానులు జయధ్వానాలతో తమ అభిమానం చాటుకున్నారు. 
*నటుడు జగపతిబాబుకి ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో నాన్నకు ప్రేమతో సినిమాకు గాను అవార్డ్ రాగా.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ అవార్డ్ ను అనౌన్స్ చేయడానికి పిలిచారు. ఆమె జగపతిబాబుని ”డాడీ అవార్డ్ మీకే” అని ఆయనను స్టేజ్ మీదకు ఆహ్వానించింది. రకుల్ కి నేను తండ్రి, మావయ్య అన్నీ అంటూ జగపతి అన్నారు. 
*రామజోగయ్య శాస్త్రికి బెస్ట్ లిరిక్స్ అవార్డ్ రాగా, ఆ అవార్డ్ ను తన గురువైన సిరివెన్నెల సీతారామశాస్తికి అంకితం చేశారు. అయితే బెస్ట్ లిరిక్స్ నామినేషన్ లో సీతారామశాస్త్రి కూడా ఉండడం గమనార్హం. 
*24 సినిమాకు గాను నటుడు సూర్యకి బెస్ట్ క్రిటిక్స్ అవార్డ్ అనౌన్స్ చేయగానే అతడి ఫ్యాన్స్ చప్పట్లతో ఆడిటోరియంని హోరెత్తించారు. చాలా కాలం తరువాత అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉందని సూర్య వెల్లడించారు. 
*సరైనోడు సినిమాకు అల్లు అర్జున్ కి బెస్ట్ క్రిటిక్స్ అవార్డ్ ప్రకటించారు. స్టేజ్ మీదకు వెళ్ళిన బన్నీ అభిమానులను ఉద్దేశించి ”ఇలా డిజె డిజె అన్ని అరిచి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని” అని బ్రాహ్మణ స్టయిల్ లో డైలాగ్ చెప్పడం హైలైట్ గా నిలిచింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన బోయపాటికి, నిర్మించిన అల్లు అరవింద్ కు థాంక్స్ చెబుతూ.. ఆ సినిమా ద్వారా తన తండ్రికి కాస్త డబ్బులు వచ్చాయని అవి తనకు కూడా కొంచెం ఇవ్వమని అందరిముందు అడిగి నవ్వించాడు. 
*ఏ.ఆర్.రెహ్మాన్ ఈవెంట్ కు మంచి ఎట్రాక్షన్ అయ్యారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. 
*సూర్య, జ్యోతిక మరోసారి జంటగా వచ్చి అందరినీ ఆకర్షించారు. జ్యోతిక్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మరింత అందంగా కనిపించింది. 
*సమంతకు ఉత్తమ నటి అవార్డ్ రాగా.. భవిష్యత్తులో తన పిల్లలకు తన తల్లి సాధించిన గొప్పతనమని చెప్పుకుంటానని వర్ణించింది. 
*డైరెక్టర్ రక్షిత్ శెట్టి, హీరోయిన్ రష్మికకు పెళ్లి అనే వార్తల నడుమ రక్షిత్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ రష్మిక చేతుల మీదుగా ఇవ్వడం అందరినీ ఆకర్షించింది. స్టేజ్ మీద యాంకర్ మీ ఇద్దరికీ త్వరలోనే పెళ్ళంట కదా అని ప్రశ్నించగా, రష్మిక సిగ్గు పడుతూ రక్షిత్ వెనుకే నుంచుంది.