నాగార్జున అప్ సెట్ అయ్యాడు!

ఓ కథను నమ్మి సినిమా చేయడం, దాని రిజల్ట్ గనుక అటు ఇటు అయితే బాధ పడడం హీరోలకు కామన్. నాగార్జున అందుకు మినహాయింపు కాదు. తను ఎంతగానో నమ్మి చేసిన ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా ఇప్పుడు నాగార్జునను బాధ పెడుతోంది. ఎంతగా అంటే రెండు రోజుల పాటు
ఆయన ఎవరినీ కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా.. ఇంట్లోనే ఉండిపోయారట. నిజానికి సినిమా ప్రీమియర్ షో వేసిన తరువాత వచ్చిన ప్రశంసలకు మొదటిరోజు రిలీజ్ అయిన తరువాత వచ్చిన టాక్ తో నాగార్జున సంతోషపడిపోయారట.

కానీ కమర్షియల్ గా సినిమా వర్కవుట్ కాలేదని, కొన్ని చోట్ల అయితే థియేటర్స్ ఖాళీగా ఉన్నాయని తెలిసి నాగార్జున చాలా బాధ పడ్డారట. దాని నుండి కోలుకోవడానికి రెండు రోజులు సమయం పట్టిందని తెలుస్తోంది. ఆ తరువాతనే అంతా సెట్ అయ్యి రెగ్యులర్ వ్యవహారాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.