ఓవర్సీస్ లో ఖైదీ తొలిరోజు లెక్క!

ఖైదీ నెంబర్ 150 సినిమా ఓవర్సీస్ లో మొదటి రోజే మిలియన్ మార్క్ ను దాటిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీక్ డేస్ లో కూడా ఈ సినిమా జనాలు తరలివచ్చారు. మొన్న అర్ధరాత్రి ఖైదీ నెంబర్ 150 షో ఓవర్సీస్ లో పడింది. విడుదలయిన మొదటి షో నుండే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ వసూళ్లను సాధించింది.

మొదటి రోజు లెక్కల ప్రకారం సినిమా భారతీయ ద్రవ్యమానంలో మొత్తం 8 కోట్ల 56 లక్షల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఓవర్సీస్ లో చాలా ఇండియన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ చిరు సినిమా ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టడం ప్రత్యేకం.