Samantha remuneration for Citadel: Hunny Bunny:
ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న Citadel: Hunny Bunny వెబ్ సిరీస్‌కి భారీ క్రేజ్ రావడంతో అటు ప్రేక్షకులలోనూ ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో ప్రముఖ నటుడు వరుణ్ ధావన్, సూపర్‌స్టార్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించారు.
స్పై-యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ కథలో ఉత్కంఠ భరిత సంఘటనలు, హై యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఉన్నాయి, దీన్ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. సమంత రూత్ ప్రభు తన నటనతో తనదైన శైలిలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ‘సిటాడెల్: హనీ బన్నీ’లో కూడా ఆమె మంచి యాక్షన్ సీన్స్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది.
🍯🐰is what the A-game looks like 😎🔥#CitadelHoneyBunnyOnPrime, watch now pic.twitter.com/ElcDuJh6KI
— prime video IN (@PrimeVideoIN) November 8, 2024
ఈ వెబ్ సిరీస్‌లో సమంతా నటన మాత్రమే కాదు, ఆమె అందుకున్న భారీ పారితోషికం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమంత ఈ పాత్ర కోసం ఏకంగా రూ.10 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. దీంతో ఇండియన్ వెబ్ సిరీస్‌లో అత్యధికంగా పారితోషికం పొందిన హీరోయిన్ల జాబితాలో సామ్ అగ్రస్థానంలో నిలిచింది.
సమంతా కి ఉన్న డిమాండ్ ఈ పారితోషికం కరెక్ట్ అని టాక్. ‘పుష్ప’ సినిమాలో “ఊ అంటావా” అనే పాట కోసం రూ.5 కోట్లు అందుకున్న తర్వాత, ఇప్పుడు ‘సిటాడెల్: హనీ బన్నీ’లో ఆమెకు భారీ పారితోషికం పొందడం, అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
ALSO READ: Prabhas Spirit సినిమా గురించిన ఆసక్తికరమైన వివరాలు.. బాక్స్ ఆఫీస్ సునామీ ఖాయమేనా?