HomeTelugu Trendingఆన్‌ ఎయిర్‌: ఫస్ట్‌ గ్లింప్స్‌

ఆన్‌ ఎయిర్‌: ఫస్ట్‌ గ్లింప్స్‌

 

Srinis On Air looks quite interesting
ఓల్డ్ మాంక్ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న హీరో, డైరెక్టర్‌ ఎంజీ శ్రీనివాస్‌(శ్రీని) మరో విభిన్న థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘ఆన్ ఎయిర్’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో శ్రీని ఆర్ జే గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బాహుబలి’ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి పలు భారీ చిత్రాల రైటర్ విజయేంద్ర ప్రసాద్ అసోసియేట్ ప్రశాంత్ సాగర్ దర్శకత్వం వహించారు. రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

తాజాగా శ్రీని పుట్టిన రోజు(జులై 9) సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేశారు‌. ఈ గ్లింప్స్‌ చిత్ర మూడ్ ను తెలియజేసే విధంగా ఉంటూ హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎంతో ఆకట్టుకుంటోంది. డైరెక్టర్‌ ప్రశాంత్ సాగర్ 35 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి పకడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లడం ఖాయమని నిర్మాతలు చెబుతున్నారు. ఓ టాప్‌ ఓటీటీ సంస్థలో ఈ చిత్రం విడుదల కానుందని, పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర నిర్మాతలు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!