‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ టీజర్.. విద్యా 100% బుద్ధి 0 %

చదువులు, ర్యాంకుల పేరుతో పిల్లలను వేధించే తల్లిదండ్రులు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించే సినిమా ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’. కన్నడలో విజయవంతమైన ఈ చిత్రం త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీనియర్ నటులు నరేష్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో చేతన్ మద్దినేని, కైషిష్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని డాల్ఫిన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై మంజునాథ్ నిర్మించారు. నరేష్ కుమార్ దర్శకత్వం వహించారు. శనివారం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో దర్శకుడు మారుతీ, మా అధ్యక్షుడు నరేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ ను చిత్ర బృందం ఘనంగా సన్మానించింది.