HomeTelugu Trendingవర్మ 'పవర్‌స్టార్‌’ నుంచి ‘గడ్డితింటావా’ పాట విడుదల

వర్మ ‘పవర్‌స్టార్‌’ నుంచి ‘గడ్డితింటావా’ పాట విడుదల

Gadditintawa song from RGV
సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’‌ పేరుతో ఓ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఆయన మరో పోస్టర్‌ను విడుదల చేశాడు వర్మ. ఈ పోస్టర్‌లో కనపడుతున్న పాత్ర నిజజీవితంలో ఎవరినైనా పోలి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ పోస్టర్‌లో పవర్ స్టార్‌కు భక్తుడైన ఓ నిర్మాత కొబ్బరికాయ కొట్టి పట్టుకొస్తున్నట్లు ఉంది.

RGV powerstar movie

ఆదివారం సాయంత్రం ఆయన ‘పవర్‌స్టార్‌’చిత్రం నుంచి గడ్డితింటావా అనే పాటను విడుదల చేశారు. ‘గడ్డి తింటావా, తౌడు తింటావా.. నా బుజ్జి గేదెమ్మ నువ్వు కుడితి తాగుతావా..’’ అని వ్యగ్యంగా సాగే ఈ పాటను పవర్‌స్టార్‌ సినిమాలోని ప్రధాన పాత్రధారి ఆలపించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలోని హీరో తన ఫాంహౌస్‌లో త‌న గేదెలు, చెట్లను ఉద్దేశిస్తూ ఈ పాట పాడినట్లు వర్మ తెలిపాడు. కాగా, ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ఈ సినిమాను ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల చేస్తానని వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా జులై 22న ఉదయం 11 గంటలకు ఈ చిత్ర టీజర్‌ విడుదల చేయనున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. అయితే టీజర్‌ చూడాలంటే రూ.25 చెల్లించాలని ఆర్జీవీ నిబంధన పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu