HomeTelugu Trending'గం గం గణేశా' మోషన్‌ పోస్టర్‌ విడుదల

‘గం గం గణేశా’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

gam gam ganesha motion post
టాలీవుడ్ యంగ్‌ హీరో ఆనంద్‌ దేవర కొండ ఇటీవలే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న సంగతి తెలిసిందే. తాజా ఆనంద్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘గం..గం..గణేశా’ ప్రకటించాడు. ఇటీవలే సమంత లాంఛ్ చేసిన గం..గం..గణేశా ఫస్ట్‌ లుక్‌ నెట్టింట హల్‌ చల్ చేస్తుంది.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. కిక్‌ ఇచ్చే ఫన్ లోడింగ్‌ .. త్వరలో అంటూ సినిమా పాత్రలు ఎలా ఉండబోతుందో హింట్‌ ఇస్తూ డిజైన్‌ చేసిన మోషన్‌ పోస్టర్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న గం..గం..గణేశా మూవీని హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఉదయ్‌ శెట్టి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!